మళయాళ హీరోయిన్ మంజు వారియర్ మీకు ఫోన్ చేసిందా?

updated: February 22, 2018 10:49 IST
మళయాళ హీరోయిన్ మంజు వారియర్ మీకు ఫోన్ చేసిందా?

మంజువారియర్ అనగానే మళయాళ స్టార్ హీరోయిన్ ... హీరో దిలీప్ మాజీ భార్య గుర్తుకు వస్తుంది.. ఆమె నుంచి మనకు ఫోన్ ఎందుకు వస్తుంది, ఆ అవసరం ఏమిటి అనుకుంటున్నారా...అయితే వచ్చే అవకాసం ఉంది. ఏదో కొత్త నెంబర్ నుంచి పోన్ వస్తే...ట్రూ కాలర్ అది మంజు వారియర్ ది అని చూపిస్తుంది.  అయితే నిజానికి అవతల మాట్లాడేది మాత్రం మళయాళ హీరోయిన్  మంజు వారియర్ మాత్రం కాదు. అసలు ఆమె ఫోన్ నెంబర్ అసలే   కాదు. కానీ మరి ఎందుకు అలా ట్రూ కాలర్ చూపిస్తోంది. 

మీకు క్రెడిట్‌ కార్డు కావాలా... ఫలానా రీఛార్జ్‌ చేసుకొండి... ఇవిగో కొత్త ఆఫర్లు అంటూ ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. మీరు బిజీగా ఉన్న సమయంలో అలాంటి కాల్స్‌ చికాకు పెడతాయి. అలాగే పరిచయం లేని వ్యక్తుల నుంచి కాని, వ్యాపార ప్రకటన దారుల నుంచి కాని, మార్కెటింగ్ సంస్థలు కాని కాల్స్ చేస్తుంటాయి. దేశమంతటా వైర్ లెస్ టెలి-సాంద్రత పెరిగినప్పటి నుంచీ ఈ అవసరం లేని స్పామ్ కాల్స్  బెడద ఎక్కువైంది.  అలాంటి కాల్స్‌ అడ్డుకోవడానికి, అసలు ఆ కాల్‌ ఎవరు చేశారో చూడటానికి ‘ట్రూ కాలర్‌’ లాంటి ఆప్స్‌ ఉన్నాయి. అయితే ట్రూ కాలర్ ని కూడా దాటి వినియోగదారుడుని ఫోన్ ఎత్తేలా చేయటం  ఎలా అనే  విషయంలో కొన్ని కంపెనీలు  కొత్త కొత్త ప్లాన్స్ వేయటం మొదలెట్టాయి.  అలాంటి ప్లాన్ ల్లో ఒకటి వేరే పాపులర్ అయిన ఓ హీరోయిన్ పేరు తమ ఫోన్ నెంబర్ కు పెట్టడం వంటి జిమ్మిక్కులు చేస్తూంటారు. దాంతో మనం మంజు వారియర్ నుంచో లేక ప్రై మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచో, సీఐడీ నుంచో పోన్ వచ్చిందని ఎత్తుతాం..అవతల వాళ్లు టెలీ మార్కెటింగ్ మొదలెట్టేస్తారన్నమాట. అదీ సంగతి. 

ట్రూకాలర్ డేటా ప్రకారం భారత మొబైల్ వినియోగదారులు నెలకు 3000 లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నారని తేలింది. భారత్ లో టాప్ నగరాలుగా ఉన్న ఢిల్లీకి 52 స్పామ్ కాల్స్ ను పొందుతూ మొదటిస్థానంలో నిలుస్తుండగా.. ముంబాయి 520లక్షల స్పామ్ కాల్స్ బెడదతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లు స్పామర్ల జాబితాలో తర్వాతి స్థానాల్లో టార్గెట్ గా ఉన్నాయని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ 450 లక్షల స్పామ్ కాల్స్, గుజరాత్ 400లక్షల స్పామ్ కాల్స్ ను పొందుతున్నాయని డేటాలో తెలిసింది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాలకు కూడా వీటి బెడద ఎక్కువగానే ఉందంట.

గుజరాత్ లో ఈ స్పామ్ కాల్స్ సంఖ్య మరీ అధికమైందట. నెలకు 400లక్షలకు పైగా స్పామ్ కాల్స్ గుజరాత్ వినియోగదారులను బాధిస్తున్నాయని వెల్లడైంది. వారానికి 101లక్షల స్పామ్ కాల్స్ బెడదతో గుజరాతీయులు విసుగుచెందుతున్నారని తెలుస్తోంది.

comments